దానిమ్మ రైతా

ABN , First Publish Date - 2015-08-30T21:20:49+05:30 IST

కావలసిన పదార్థాలు: దానిమ్మ గింజలు - 1 కప్పు, ఉడికించిన బంగాళదుంప గుజ్జు - 1 కప్పు, మీగడ లేని పెరుగు - 1 కప్పు

దానిమ్మ రైతా

కావలసిన పదార్థాలు: దానిమ్మ గింజలు - 1 కప్పు, ఉడికించిన బంగాళదుంప గుజ్జు - 1 కప్పు, మీగడ లేని పెరుగు - 1 కప్పు, పచ్చిమిర్చి తరుగు - 1 టీ స్పూను, కొత్తిమీర తరుగు - 1 టేబుల్‌ స్పూను, పంచదార + ఉప్పు - రుచికి తగినంత, చాట్‌ మసాల - అర టీ స్పూను.
తయారుచేసే విధానం: పెరుగులో పంచదార, ఉప్పు కలిపి గిలకొట్టాలి. తర్వాత బంగాళదుంప గుజ్జు, పచ్చిమిర్చి తరుగు, దానిమ్మ గింజలు, చిటికెడు చాట్‌ మసాల వేసి బాగా కలపాలి. కొద్దిసేపు ఫ్రిజ్‌లో ఉంచి తినేముందు చాట్‌ మసాల చల్లి, కొత్తిమీరతో అలంకరించాలి.

Updated Date - 2015-08-30T21:20:49+05:30 IST