Abn logo

గుమ్మడి రైతా

కావ

లసిన పదార్థాలు: గుమ్మడికాయ ముక్కలు - 2 కప్పులు, పచ్చిమిర్చి - 2, పచ్చికొబ్బరి ముక్కలు - అరకప్పు, పెరుగు - 3 కప్పులు, ఉప్పు - రుచికి తగినంత, పుట్నాలు - 1 టేబుల్‌ స్పూను, నూనె - 2 టీ స్పూన్లు, శనగపప్పు - 1 టీ స్పూను, మినప్పప్పు - 1 టీ స్పూను, పసుపు - అర టీ స్పూను, కరివేపాకు - 4 రెబ్బలు, ఆవాలు - అర టీ స్పూను.
తయారుచేసే విధానం: గుమ్మడి ముక్కల్ని మరీ మెత్తగా కాకుండా ఉడికించుకోవాలి. పచ్చిమిర్చి, పుట్నాలు, కొబ్బరి గ్రైండ్‌ చేసుకోవాలి. కొబ్బరి మిశ్రమం, ఉడికించిన గుమ్మడి ముక్కలు, ఉప్పు పెరుగులో వేసి కలపాలి. తర్వాత కడాయిలో నూనె వేసి మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, పసుపు, కరివేపాకులతో తాలింపు పెట్టి పెరుగు మిశ్రమంలో కలపాలి. ఈ రైతా బ్రెడ్‌తో చాలా బాగుంటుంది.

అడవుల సంరక్షణ అందరి బాధ్యతపోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివిపత్తి కొనుగోళ్లపై ప్రతిష్టంభనమెడికల్‌ కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెంచాలిబాలల హక్కులను కాపాడాలిఈ స్థలంలో నిర్మాణాలు చేపట్టవద్దుపోలీసు అమరవీరుల త్యాగాలు భావితరాలకు స్ఫూర్తిదాయకం రోగికి పరీక్షే...!దిగుబడిపై అన్నదాతల దిగాలు పోలీసు అమరవీరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలి
Advertisement