రైతా

ABN , First Publish Date - 2018-02-10T21:42:52+05:30 IST

తాజా గడ్డ పెరుగు-ఒక కప్పు, ఉడకబెట్టిన చిలకడదుంప-ఒకటి (తరిగి), ఉడకబెట్టిన బంగాళాదుంప-ఒకటి...

రైతా

కావలసినవి
తాజా గడ్డ పెరుగు-ఒక కప్పు, ఉడకబెట్టిన చిలకడదుంప-ఒకటి (తరిగి), ఉడకబెట్టిన బంగాళాదుంప-ఒకటి (తరిగి), కీరకాయ-ఒకటి, వాటర్‌ చెస్ట్‌నట్స్‌ (శింఘారా)- ఐదు(ఉడకబెటి పైనున్న తొక్క తీసి సన్నటి ముక్కలుగా చేయాలి), కొత్తిమీర-గుప్పెడు (తరుగు), పచ్చిమిర్చి- ఒకటి (సన్నటి ముక్కలుగా తరిగి), బాగా వేగించిన పల్లీలు- ఒక టేబుల్‌స్పూను, జీలకర్ర పొడి- అర టీస్పూను, జీలకర్ర-అర టీస్పూను, నూనె- ఒక టీస్పూను, చక్కెర-రుచికి సరిపడా, ఉప్పు-తగినంత.
 
తయారీవిధానం
 
బాగా లోతుగా ఉండే సలాడ్‌ బౌల్‌లో గడ్డ పెరుగును తీసుకుని చిక్కగా చేయాలి.
అందులో జీలకర్ర పొడి, ఉప్పు, చక్కెర, పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా కలపాలి.
తర్వాత రెడీగా పెట్టుకున్న కూరముక్కలు, పల్లీలు అందులో వేసి బాగా కలపాలి.
ఇలా తయారైన రైతాను ఫ్రిజ్‌లో ఉంచాలి. రైతాను తాగాలనుకునే ముందు చిన్న మూకుడులో కొద్దిగా నూనె వేసి జీలకర్ర వేయాలి. చిటపటలాడుతున్న జీలకర్రను కూల్‌ కూల్‌గా ఉన్న రైతాపై చల్లాలి. రెడీగా ఉన్న కొత్తిమీరను రైతాను దాని మీద చల్లి కొద్ది కొద్దిగా సిప్‌ చేస్తూ తాగితే శరీరానికి కొత్త శక్తి వచ్చినట్టు ఉంటుంది.

Updated Date - 2018-02-10T21:42:52+05:30 IST