Advertisement
Advertisement
Abn logo
Advertisement

పాలకూర రైతా

v id="pastingspan1">కావలసిన పదార్థాలు
 
తరిగిన లేత పాలకూర - 2 కప్పులు, సన్నగా తరిగిన కీరా దోసముక్కలు - 1/2 కప్పు, సన్నగా తరిగిన వెల్లుల్లి - 1 స్పూను, జీలకర్ర - 1/2 స్పూను, సన్నగా తరిగిన కొత్తిమీర - 2 స్పూనులు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి - 1 స్పూను, ఉప్పు - తగినంత, నిమ్మరసం - 2 స్పూనులు, నూనె - 1/2 స్పూను, గిలకొట్టిన పెరుగు - 1 కప్పు.
 
తయారుచేసే విధానం
 
ముందుగా ఒక పాన్లో నూనె వేడిచేసి దానిలో జీలకర్ర, వెల్లుల్లి వెయ్యండి. వెల్లుల్లి వేగిన తరువాత పాలకూర వేసి ఐదు నిమిషాల తరువాత స్టవ్‌ ఆపి, పాలకూర మిశ్రమం చల్లారనివ్వండి. వేరే గిన్నెలో గిలకొట్టిన పెరుగు తీసుకుని దానికి కీరా ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, నిమ్మరసం, ఉప్పు కలపండి. ఇందులో చల్లారిన పాలకూర మిశ్రమం వేసి కలపండి. ఈ పాలకూర రైతాను సలాడ్‌లా కానీ, బిరియానీలో కానీ పరాటాలతో కానీ తింటే బాగుంటుంది.

కాగజ్‌నగర్‌లో కంపుకొడుతున్న ‘భగీరథ’ నీరుసంస్కృతీ సంప్రదాయాలు భావితరాలకు అందించాలిస్వయం ఉపాధి శిక్షణపై అవగాహనసురోజీబాబా బోధనలు ఆదర్శప్రాయంపొంచి ఉన్న ప్రమాదం పర్యాటక కేంద్రంగా సిర్పూర్‌(టి)ఇక మేకలు, గొర్రెలకు టీకాలు.!కాంగ్రెస్‌ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలిస్వచ్చంద సంస్థలు సామాజిక సేవలో ముందుండాలి అంతర్రాష్ట్ర వంతెన వద్ద కరోనా పరీక్షలు నిర్వహించాలి
Advertisement