Abn logo

ఆలూ పకోడీ కర్రీ

కావలసిన పదార్థాలు
పెసరపప్పు - పావు కిలో, ఆలుగడ్డలు - 2, ఉల్లిపాయ - 1, టమోటాలు - 2, అల్లం వెల్లుల్లి పేస్టు - 1 టీ స్పూను, నూనె - ఒక కప్పు, కారం - 1 టీ స్పూను, పసుపు - అర టీ స్పూను, గరం మసాల - అర టీ స్పూను, కొత్తిమీర - 1 కట్ట, ఉప్పు - రుచికి తగినంత.
 
తయారుచేసే విధానం
 
(4 గంటలు) నానబెట్టిన పెసరపప్పులో కొద్దిగా ఉప్పు కలిపి చిక్కగా రుబ్బి, పకోడీలు వేసుకొని పక్కనుంచాలి. ఒక టేబుల్‌ స్పూన్‌ నూనెలో ఉల్లిపాయ ముక్కల్ని దోరగా వేగించి, మెత్తగా రుబ్బుకోవాలి. మరో కడాయిలో అల్లం వెల్లుల్లి, ఉల్లి పేస్టు వేగించి, టమోటా తరుగు, కారం, పసుపు వేయాలి. 5 నిమిషాల తర్వాత ఆలుగడ్డ ముక్కలు వేసి తగినన్ని నీళ్లు పోసి మూతపెట్టి ఉడికించాలి. చిక్కబడ్డాక పెసర పకోడీలు, గరం మసాల, కొత్తిమీర కలిపి చిన్నమంటపై మూడు నిమిషాలు ఉంచి దించేయాలి. వేడివేడి అన్నంతో లేదా రోటీతో చాలా రుచిగా ఉండే కర్రీ ఇది.

ప్రమాదవశాత్తు ఒకరి మృతిహార్వెస్టర్‌కు తగిలి వ్యవసాయ కూలీ మృతికొండాపూర్‌లో గుర్తు తెలియని వృద్ధుడు మృతిఇరువురి మధ్య గొడవ..తోపులాటలో ఒకరి మృతిశ్మశాన వాటికలను త్వరగా పూర్తి చేయాలిపల్లెల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు అయ్యప్ప భక్తుడిపై దాడి అభివృద్ధికే గ్రేటర్‌ ప్రజల పట్టంగ్రేటర్‌ తీర్పు కొత్తమార్పు‘సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వాలు విఫలం’
Advertisement
Advertisement