ఆలూ లాలీపప్స్‌

ABN , First Publish Date - 2015-08-30T18:11:13+05:30 IST

కావలసిన పదార్థాలు: సగానికి చీరిన చెరుకు ముక్కలు (10 సెంటీమీటర్ల పొడవు) - 6, ఉడికించి మెదిపిన బంగాళదుంపలు - 200గ్రా.,

ఆలూ లాలీపప్స్‌

కావలసిన పదార్థాలు: సగానికి చీరిన చెరుకు ముక్కలు (10 సెంటీమీటర్ల పొడవు) - 6, ఉడికించి మెదిపిన బంగాళదుంపలు - 200గ్రా., పచ్చిమిర్చి - 2, ఉల్లిపాయలు- 2, కొత్తిమీర - 1 కట్ట, బ్రెడ్‌పొడి - 200 గ్రా., మొక్కజొన్నపిండి- 150 గ్రా., జీరాపొడి - అర టీ స్పూను, గరం మసాలా - అర టీ స్పూను, చాట్‌ మసాలా - చిటికెడు, ఉప్పు - రుచికి తగినంత.
తయారుచేసే విధానం: ముందుగా కూరగాయల్ని చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. ఉడికించి మెదిపిన బంగాళదుంపల్లో ఉల్లి, మిర్చి, కొత్తిమీర, గరం మసాలా, ఉప్పు, జీరాపొడులను వేసి ముద్దలా కలుపుకోవాలి. మొక్కజొన్నపిండికి నీటిని చేరుస్తూ జారుగా కలిపి ఉంచుకోవాలి. బంగాళదుంప ముద్దను చెరుకు ముక్కల చివర్న లాలీపప్‌లా అతికించాలి. వీటిని మొక్కజొన్నపిండి జారులో ముంచి బ్రెడ్‌పొడిలో దొర్లించి దోరగా (ముద్ద ఉన్నవైపు మాత్రమే) వేగించుకోవాలి. వీటిపై చాట్‌ మసాలా చల్లి తింటే చాలా రుచిగా ఉంటాయి.

Updated Date - 2015-08-30T18:11:13+05:30 IST