ఆలు కబాబ్‌

ABN , First Publish Date - 2015-08-30T18:04:02+05:30 IST

కావలసిన పదార్థాలు: బంగాళదుంపలు - అరకేజీ, బ్రెడ్‌ స్లయిస్‌లు - 2, జీలకర్ర - 1 టీ స్పూను, ఉప్పు - తగినంత, కారం - 1 టీ స్పూను,

ఆలు కబాబ్‌

కావలసిన పదార్థాలు: బంగాళదుంపలు - అరకేజీ, బ్రెడ్‌ స్లయిస్‌లు - 2, జీలకర్ర - 1 టీ స్పూను, ఉప్పు - తగినంత, కారం - 1 టీ స్పూను, నూనె - వేగించడానికి సరిపడా, బ్రెడ్‌ పొడి - 2 కప్పులు.
తయారుచేసే విధానం: బంగాళదుంపల్ని మెత్తగా ఉడికించి తొక్కతీసి చిదిమి పెట్టుకోవాలి. జీలకర్రను వేగించి పొడిచేసి, అందులో కారం, ఉప్పు కలిపి పక్కనుంచాలి. బంగాళదుంప గుజ్జులో నీటిలో తడిపిన బ్రెడ్‌ స్లయిస్‌ని వేసి బాగా కలపాలి. ఈ ముద్దను చిన్న చిన్న ఉండలు చేసుకొని, వడల్లా వత్తి మధ్యలో జీలకర్ర మిశ్రమాన్ని కొద్దిగా పెట్టి మూసేస్తూ బుల్లెట్లలా తయారుచేసి, బ్రెడ్‌ పొడిలో దొర్లించాలి. తర్వాత నూనెలో అన్ని వైపులా తిప్పుతూ దోరగా వేగించాలి. ఈ కబాబ్‌లు పుదీనా చట్నీతో ఎంతో రుచిగా ఉంటాయి.

Updated Date - 2015-08-30T18:04:02+05:30 IST