ఉల్లి కాడల రైస్‌

ABN , First Publish Date - 2015-09-01T18:33:49+05:30 IST

కావలసిన పదార్థాలు: ఉల్లికాడలు - 12, పచ్చిబఠాణి - పావుకప్పు,

ఉల్లి కాడల రైస్‌

కావలసిన పదార్థాలు
 
ఉల్లికాడలు - 12, పచ్చిబఠాణి - పావుకప్పు, పొడి అన్నం - 1 కప్పు, నిమ్మరసం - 2 టేబుల్‌ స్పూన్లు, పసుపు - అర టీ స్పూను, వాంగిబాత్‌ / సాంబారు పొడి - ఒకటిన్నర స్పూను, నూనె - 2 టేబుల్‌ స్పూన్లు, ఆవాలు - 1 టీ స్పూను, మినపప్పు - 1 టీ స్పూను, ఎండుమిర్చి - 1, కరివేపాకు - 4 రెబ్బలు, ఉప్పు - రుచికి, నేతిలో వేగించిన జీడిపప్పు.
 
తయారుచేసే విధానం
 
ఉల్లికాడలు శుభ్రంచేసి సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకుతో తాలింపు పెట్టుకుని (కొద్దిసేపు నీటిలో నానబెట్టిన) పచ్చిబఠాణి, ఉల్లికాడలు వేయాలి. ఉల్లి కాడలు తరుగు దోరగా వేగిన తర్వాత పసుపు, సాంబారు / వాంగీబాత్‌ పొడి చల్లి రెండు నిమిషాలు వేగించి ఉప్పు, అన్నం కలపాలి. చల్లబడ్డ తర్వాత నిమ్మరసం కలిపి జీడిపప్పుతో అలంకరించాలి.

Updated Date - 2015-09-01T18:33:49+05:30 IST