అత్తిపళ్ల జ్యూస్‌

ABN , First Publish Date - 2015-08-29T22:05:41+05:30 IST

కావలసిన పదార్థాలు: అంజూర్‌ డ్రై ఫ్రూట్స్‌ - 4, నీరు - 1 కప్పు, బెల్లం - 1 టేబుల్‌ స్పూను, యాలకులు - 2

అత్తిపళ్ల జ్యూస్‌

కావలసిన పదార్థాలు: అంజూర్‌ డ్రై ఫ్రూట్స్‌ - 4, నీరు - 1 కప్పు, బెల్లం - 1 టేబుల్‌ స్పూను, యాలకులు - 2, అల్లం - అంగుళం ముక్క, తులసి ఆకులు - 5/6
తయారుచేసే విధానం: అంజూర్‌ని అరకప్పు నీటిలో దాదాపు 2 గంటలు నానబెట్టి చేత్తో చిదిమి నీటిలో కరిగించాలి. మరో కప్పు నీటిలో బెల్లం వేడి చేసి తులసి ఆకులు, చిదిమిన యాలకులు, అల్లం వేసి మూతపెట్టాలి. గంట తర్వాత వడకట్టి కరిగిన అంజూర్‌ నీటిలో కలిపి తాగాలి.

Updated Date - 2015-08-29T22:05:41+05:30 IST