బొంబాయి రవ్వ పొంగల్‌

ABN , First Publish Date - 2015-09-03T22:50:51+05:30 IST

కావలసిన పదార్థాలు: బొంబాయి రవ్వ - 1 కప్పు, పెసరపప్పు - పావు కప్పు,

బొంబాయి రవ్వ పొంగల్‌

కావలసిన పదార్థాలు: బొంబాయి రవ్వ - 1 కప్పు, పెసరపప్పు - పావు కప్పు, పాలు - 1 కప్పు, పచ్చిమిర్చి - 1, అల్లం తరుగు - అర టేబుల్‌ స్పూను, కరివేపాకు - 4 రెబ్బలు, మిరియాలు - 2 టీ స్పూన్లు, జీలకర్ర - 2 టీ స్పూన్లు, ఇంగువ - చిటికెడు, ఉప్పు - రుచికి తగినంత, జీడిపప్పు - 15, నెయ్యి - పావు కప్పు.
తయారుచేసే విధానం: పెసరుపప్పును గంటపాటు నానబెట్టి ఉప్పు వేసి మెత్తగా ఉడికించి, మూడు కప్పుల నీరు కలిపి పక్కనుంచాలి. నేతిలో జీడిపప్పు, మిరియాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, ఇంగువ వేగించి తీసేయాలి. అదే కడాయిలో పెసరపప్పు జారుని బుడగలు వచ్చేదాక వేడిచేసి, రవ్వ వేసి కలపాలి. అవసరమైతే సన్నని మంటపై కొద్దిసేపు ఉంచాలి. తర్వాత తాలింపు మిశ్రమం బాగా కలపి వేడివేడిగా తినాలి.

Updated Date - 2015-09-03T22:50:51+05:30 IST