దోసకాయ దోశ

ABN , First Publish Date - 2015-09-04T18:48:39+05:30 IST

కావలసిన పదార్థాలు: దోసకాయ తురుము - 2 కప్పులు, మెంతులు - చిటికెడు, అటుకులు

దోసకాయ దోశ

కావలసిన పదార్థాలు: దోసకాయ తురుము - 2 కప్పులు, మెంతులు - చిటికెడు, అటుకులు - అర కప్పు, బియ్యం - అర కప్పు, ఉప్పు - సరిపడా, నూనె - తగినంత.
తయారు చేసే విధానం: బియ్యం, మెంతులు, అటుకులు విడివిడిగా రెండు గంటలసేపు నానబెట్టాలి. వీటికి దోసకాయ తురుము చేర్చి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమంలో ఉప్పు కలిపి రాత్రంతా బయటే ఉంచాలి. ఉదయం దోశలు వేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి.

Updated Date - 2015-09-04T18:48:39+05:30 IST