కొత్తిమీర పొంగనాలు

ABN , First Publish Date - 2015-09-04T20:12:39+05:30 IST

కావలసిన పదార్థాలు: బియ్యం - 2 కప్పులు, మెంతులు - 1 టీ స్పూను, మినప్పప్పు - 1 కప్పు, ఉల్లి తరుగు

కొత్తిమీర పొంగనాలు

కావలసిన పదార్థాలు: బియ్యం - 2 కప్పులు, మెంతులు - 1 టీ స్పూను, మినప్పప్పు - 1 కప్పు, ఉల్లి తరుగు - 1 కప్పు, పచ్చికొబ్బరి (చిన్న) ముక్కలు - అరకప్పు, అల్లం+పచ్చిమిర్చి పేస్ట్‌ - 1 టీ స్పూను, జీలకర్ర - 1 టీ స్పూను, కొత్తిమీర తరుగు - 1 కప్పు, నూనె - సరిపడా, ఉప్పు - రుచికి తగినంత.
తయారుచేసే విధానం: బియ్యం, మినప్పప్పు, మెంతుల్ని ఒక పాత్రలో 8 గంటలు నానబెట్టాలి. తర్వాత మెత్తగా రుబ్బి అల్లం, మిర్చి పేస్ట్‌, పచ్చికొబ్బరి ముక్కలు, ఉప్పు, ఉల్లి, కొత్తిమీర తరుగు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని గుంతల్లో పోసి, అన్ని వైపులా తిప్పుతూ వేగించాలి. ఇవి పుదీనా చట్నీతో పాటు ఆలు కుర్మాతో తిన్నా బాగుంటాయి.

Updated Date - 2015-09-04T20:12:39+05:30 IST