రాజ్మా కబాబ్‌

ABN , First Publish Date - 2015-09-05T16:04:46+05:30 IST

కావలసిన పదార్థాలు: రాజ్మా - 2 కప్పులు, అల్లం తరుగు - 1 టీ స్పూను, పుదీనా తరుగు - అర కప్పు

రాజ్మా కబాబ్‌

కావలసిన పదార్థాలు: రాజ్మా - 2 కప్పులు, అల్లం తరుగు - 1 టీ స్పూను, పుదీనా తరుగు - అర కప్పు, ఉల్లి తరుగు - 1 కప్పు, గరం మసాలా - 1 టీ స్పూను, జీరా పొడి - 1 టీ స్పూను, పసుపు - చిటికెడు, ఉప్పు - రుచికి తగినంత, నూనె - 2 టేబుల్‌ స్పూన్లు, నిమ్మరసం - 1 టీ స్పూను.
తయారుచేసే విధానం: రాజ్మాను 6 గంటలు నానబెట్టాలి. తర్వాత కుక్కర్లో 5 కప్పుల నీటిలో 3 విజిల్స్‌ వచ్చేదాకా ఉడికించి చల్లారాక మిక్సీలో గ్రైండ్‌ చేసుకోవాలి. కడాయిలో 1 టేబుల్‌ స్పూను నూనె వేసి ఉల్లి తరుగు, అల్లం తరుగు, పసుపు, జీరాపొడి, పుదీనా వేగించి, రాజ్మా ముద్దని కలిపి రెండు నిమిషాల తర్వాత దించేయాలి. దీంట్లో మసాలపొడి, ఉప్పు, నిమ్మరసం బాగా కలిపి, చిన్న చిన్న ఉండలు చేసుకొని టిక్కాలుగా వత్తి పెనంమీద రెండు వైపులా దోరగా వేగించుకోవాలి. ఈ కబాబ్‌లను వేడివేడిగా టమోటా సాస్‌తో తింటే చాలా రుచిగా ఉంటాయి.

Updated Date - 2015-09-05T16:04:46+05:30 IST