రంగేలీ పూరీలు

ABN , First Publish Date - 2015-09-05T16:07:33+05:30 IST

కావలసినవి: గోధుమపిండి-300 గ్రాములు, పాలకూర గుజ్జు -100 గ్రాములు, బీట్‌రూట్‌ రసం-100గ్రాములు,

రంగేలీ పూరీలు

కావలసినవి: గోధుమపిండి-300 గ్రాములు, పాలకూర గుజ్జు -100 గ్రాములు, బీట్‌రూట్‌ రసం-100గ్రాములు, వాము- 5 గ్రాములు, నెయ్యి-వేగించడానికి సరిపడినంత.
ఎలా చేయాలి: పిండిని మూడు సమ భాగాలుగా(100 గ్రాముల చొప్పున) చేయాలి. ఒక భాగం పిండిలో పాలకూరగుజ్జుని కలిపి ముద్దలా చేయాలి. రెండవ భాగంలో బీట్‌రూట్‌ రసం పోసి దాన్ని మరో పిండిముద్దలా చేయాలి. మూడవ భాగానికి వాముని కలిపిముద్దలా చేసిపెట్టుకోవాలి. ఈ మూడు భాగాల పిండిని చిన్న చిన్న ఉండలుగా చుట్టి పూరీల్లాగ వత్తాలి. నూనె కాచి అందులో వీటిని వేగించాలి. అన్ని రంగుల పూరీలను ఒక ప్లేటులో పెట్టి టేబిల్‌ మీద పెడితే చూడడానికీ బాగుంటుంది. ఒక్కొక్క పూరీకి ఒక్కొక్క రుచి వచ్చి తినడానికీ బాగుంటుంది. ఒకే ఆహారంలో మూడు పదార్ధాలు కలవడం వలన పౌష్టికాహారం లభించినట్టూ అవుతుంది. బంగాళాదుంప పెరుగు చట్నీతో కలిపి వేడి వేడిగా తింటే ఇంకా బాగుంటుంది.

Updated Date - 2015-09-05T16:07:33+05:30 IST