Advertisement
Advertisement
Abn logo
Advertisement

వంకాయ బోండాలు

కావలసిన పదార్థాలు: (చిన్న సైజు) వంకాయలు - 4, ఉల్లిపాయలు - 2, పచ్చిమిర్చి - 2, అల్లం వెల్లుల్లి పేస్టు - 1 టీ స్పూను, గరం మసాల - 1 టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, నూనె - వేగించడానికి సరిపడా, శనగపిండి - 1 కప్పు, వాము - చిటికెడు. చింతపండు గుజ్జు - 1 టేబుల్‌ స్పూను.
తయారుచేసే విధానం: ఒక పాత్రలో శనగపిండి, వాము, చిటికెడు ఉప్పు వేసి తగినంత నీటితో జారుగా కలిపి పక్కనుంచాలి. వంకాయలను కిందనుండి తొడిమ వరకు గాటు పెట్టి కొద్ది నీటిలో 5 నిమిషాలు ఉడికించి తీసెయ్యాలి. కడాయిలో ఉల్లి, పచ్చిమిర్చి తరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు వేగించి మసాల పొడి, ఉప్పు, చింతపండు గుజ్జుతో పాటు మిక్సీలో పేస్టు చేసుకోవాలి. ఈ పేస్టును చీరిన వంకాయల్లో కూరి శనగపిండి జారులో ముంచి నూనెలో దోరగా వేగించుకోవాలి. సాయంత్రం టిఫిన్‌గా వేడివేడిగా టమోటా సాస్‌తో అద్దుకుని తింటే బాగుంటాయి.

అసాంఘిక కార్యకలాపాలను నిర్మూలించాలిపల్లెల్లో రియల్‌ మాఫియాపత్తి ధర పైపైకి..!మత్స్యకారులకు కేంద్రం చేయూతప్రణాళిక ప్రకారం పనులు పూర్తిచేయాలిసినిమా పోస్టర్‌ ఆవిష్కరించిన ఎమ్మెల్యే ఆత్రం సక్కుఉద్యోగులు అంకిత భావంతో పనిచేయాలిక్రీడాకారులకు ప్రోత్సాహాన్ని అందిస్తాం ‘ఉపాధిహామీ’లో కూలీల సంఖ్యను పెంచాలి పిల్లలు వ్యాధుల బారిన పడకుండా రోటా వ్యాక్సిన్‌
Advertisement