కరివేపాకు పప్పు

ABN , First Publish Date - 2015-08-29T23:12:22+05:30 IST

కావలసిన పదార్థాలు: కరివేపాకు ఆకులు - అర కప్పు, పెసరపప్పు - అర కప్పు, శనగపప్పు - 1 టీ స్పూను,

కరివేపాకు పప్పు

కావలసిన పదార్థాలు: కరివేపాకు ఆకులు - అర కప్పు, పెసరపప్పు - అర కప్పు, శనగపప్పు - 1 టీ స్పూను, మినప్పప్పు - 1 టీ స్పూను, పసుపు - చిటికెడు, నెయ్యి - అర టేబుల్‌ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, మిరియాలపొడి - 1 టీ స్పూను, నీరు ఒకటిన్నర కప్పు, ఎండుమిర్చి - 4, వెల్లుల్లి రేకలు - 6, జీలకర్ర+ఆవాలు - అరస్పూను.
తయారుచేసే విధానం: కుక్కర్‌పాన్‌లో పప్పులన్నిటితోపాటు కరివేపాకు కూడా వేసి దోరగా వేగించి, ఉప్పు, పసుపు, మిరియాలపొడి, నీరు వేసి ఉడికించాలి. తర్వాత నేతిలో ఎండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలతో తిరగమోత పెట్టుకోవాలి. వేడి వేడి అన్నంలోకి కరివేపాకు పప్పు ఎంతో రుచిగా ఉంటుంది.

Updated Date - 2015-08-29T23:12:22+05:30 IST