Abn logo

పొట్లకాయ పప్పు

కావలసిన పదార్థాలు: పొట్లకాయ - 1, కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు - 2 టేబుల్‌ స్పూన్ల చొప్పున, ఆవాలు, మినప్పప్పు, నూనె, అర టీ స్పూను చొప్పున, ఇంగువ - చిటికెడు, పసుపు - పావు టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, కరివేపాకు - 4 రెబ్బలు.
మసాల పొడి కోసం: నూనె - అర టీ స్పూను, శనగపప్పు -1 టేబుల్‌ స్పూను, మినప్పప్పు - పావు టీ స్పూను, దనియాలు, మిరియాలు - అర టీ స్పూను చొప్పున, ఎండుమిర్చి - 2, కొబ్బరికోరు - 2 టేబుల్‌ స్పూన్లు.
తయారుచేసే విధానం: పొట్లకాయను గింజలు లేకుండా తరిగి పప్పులు, పసుపుతో పాటు కొద్ది నీటిలో మూడు విజిల్స్‌ వచ్చేవరకు ఉడికించాలి. నూనెలో మసాలా దినుసులు (కొబ్బరి తప్ప) దోరగా వేగించి, చల్లారిన తర్వాత కొబ్బరి కూడా కలిపి నీరు చిలకరించి పేస్టు చేసుకోవాలి. ఉడికిన పప్పు మిశ్రమంలో కొబ్బరి పేస్టు, ఉప్పు కలిపి 5 నిమిషాలు ఉడికించాలి. విడిగా తాలింపు వేసి పప్పులో కలిపి కరివేపాకు చల్లి మూతపెట్టాలి. వేడి అన్నంతో మంచి కాంబినేషన్‌.

స్వచ్ఛంద లాక్‌డౌన్‌కు తీర్మానంపోలీసుల వేధింపులతో యువకుడి ఆత్మహత్యాయత్నం విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠినచర్యలు విధుల్లోకి తీసుకోవాలని ఫీల్డ్‌ అసిస్టెంట్ల వేడుకోలుఆస్తి పన్ను వసూళ్లపై నజర్‌పుడమికి పండగనేటి నుంచి స్వచ్ఛంద లాక్‌డౌన్‌ నాటిన ప్రతీ మొక్కను సంరక్షించాలినర్సరీల్లో అన్ని రకాల మొక్కలు ఉండాలి: కలెక్టర్‌ఘనంగా జాతీయ వైద్యుల దినోత్సవం
Advertisement
d_article_rhs_ad_1
Advertisement