నిమ్మరసంతో పాలకూర పప్పు

ABN , First Publish Date - 2015-08-29T23:31:35+05:30 IST

కావలసిన పదార్థాలు: పాలకూర - 2 కట్టలు, కందిపప్పు - 1 కప్పు, నిమ్మరసం - 2 టేబుల్‌ స్పూన్లు, వెలుల్లి రేకలు - 4,

నిమ్మరసంతో పాలకూర పప్పు

కావలసిన పదార్థాలు: పాలకూర - 2 కట్టలు, కందిపప్పు - 1 కప్పు, నిమ్మరసం - 2 టేబుల్‌ స్పూన్లు, వెలుల్లి రేకలు - 4, ఉల్లి తరుగు - పావు కప్పు, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు - అర టీ స్పూను చొప్పున, పచ్చిమిర్చి - 6, ఉప్పు - రుచికి తగినంత, పసుపు - పావు టీ స్పూను, ఇంగువ - పావు టీ స్పూను.
తయారుచేసే విధానం: కందిపప్పులో సరిపడా నీరు పోసి కుక్కర్లో ఉడికించాలి (ఒక విజిల్‌ సరిపోతుంది. పప్పు పప్పుగానే ఉండాలి. రుబ్బకూడదు). పాలకూర ఆకుల్ని సాధ్యమైనంత సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో నూనె వేసి వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు వేగించి ఉల్లి, పచ్చిమిర్చి తరుగు, ఇంగువ, పసుపు వేయాలి. తాలింపు దోరగా వేగిన తర్వాత పాలకూర తరుగు వేసి చిన్నమంటపై (మూత పెట్టకుండా) మగ్గించాలి. ఇప్పుడు (విడిగా మరిగించిన) రెండు కప్పుల వేడి నీరు పోయాలి. రెండు నిమిషాల తర్వాత పప్పు కూడా వేసి తగినంత ఉప్పు కలిపి మరో రెండు నిమిషాల తర్వాత కరివేపాకు, నిమ్మరసం చల్లి దించేయాలి. రోజువారీ చేసుకునే పాలకూర పప్పుకంటే రుచిలో తేడా ఉంటుంది. అన్నంతో పాటు పరాటాల్లోకి కూడా బాగుంటుంది.


Updated Date - 2015-08-29T23:31:35+05:30 IST