Abn logo

పనీర్‌ ఫ్రైడ్‌ రైస్‌

కావలసిన పదార్థాలు
 
పనీర్‌ ముక్కలు: 250 గ్రాములు, బాసుమతీ రైస్‌(ఉడికించిన అన్నం): నాలుగు కప్పులు, కాప్సికమ్‌: ఒకటి లేదా రెండు (ముక్కలుగా చేసుకోవాలి), ఉల్లిపాయ: ఒకటి (ముక్కలుచేసుకోవాలి), అల్లం వెల్లుల్లి ముద్ద: టేబుల్‌ స్పూను, అజినోమోటో: చిటికెడు ఉప్పు: తగినంత, నూనె: తగినంత, వెన్న: రెండు స్పూన్లు.
 
తయారీ విధానం
 
ముందుగా మందపాటి గిన్నెలేదా బాండీలో వెన్న, నూనె వేసి కాగిన తరువాత పనీర్‌ ముక్కలను దోరగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఇవి వేగిన తరువాత అల్లంవెల్లుల్లి ముద్ద, అజినోమోటో వేసి మరికొద్దిసేపు వేయించి వీటికి కాప్పికమ్‌ ముక్కలు జతచేయాలి. ఇవి ఉడుకుతున్న సమయంలో ఉప్పు కూడా వేసుకోవాలి. కాప్సి కమ్‌ ముక్కలు బాగా ఉడికిన తరువాత వేయించి పెట్టుకున్న పనీర్‌ ముక్కలు వేసుకొని కొద్దిసేపు వేయించి చివరగా ఉడికించి పెట్టుకున్న అన్నం జతచేసి బాగా కలిపి దింపేయాలి.


దరలను తగ్గించాలి : వామపక్ష నాయకులుహరితహారం పకడ్బందీగా నిర్వహించాలిజిల్లాలో పటిష్ట నిఘా వ్యవస్థ : ఎస్పీసాదాసీదాగా జడ్పీ సర్వసభ్య సమావేశంపల్లె ప్రగతి ముందుకు సాగేనా?పెట్రోల్‌, డీజిల్‌, నిత్యావసర ధరలను తగ్గించాలిలొంగిపోయిన మావోయిస్టులను అన్ని విధాలుగా ఆదుకుంటాంఫుట్‌రైలింగ్‌ పనులను పరిశీలించిన మున్సిపల్‌ చైర్మన్‌అధికారుల పల్లెబాట ఓటు హక్కు నమోదు చేసుకునేలా చర్యలు చేపట్టాలి
Advertisement
Advertisement