బిసీ బేళా బాత్‌

ABN , First Publish Date - 2015-08-30T00:07:30+05:30 IST

కావలసిన పదార్థాలు: బియ్యం - 1 కప్పు, కందిపప్పు - అర కప్పు, చింతపండు - నిమ్మకాయంత, ఉల్లిపాయ - 1,

బిసీ బేళా బాత్‌

కావలసిన పదార్థాలు: బియ్యం - 1 కప్పు, కందిపప్పు - అర కప్పు, చింతపండు - నిమ్మకాయంత, ఉల్లిపాయ - 1, బీన్స్‌-5, కారెట్లు -2, ఆలు - 1, పచ్చిబఠాణి - గుప్పెడు, టమోటో - 1, ఉప్పు - రుచికి తగినంత, నూనె - 1 టేబుల్‌ స్పూను, మసాలా పొడి - 1 టీ స్పూను, ఎండుకొబ్బరి తురుము - అర కప్పు, ఆవాలు - అర టీ స్పూను, మెంతులు - పావు టీ స్పూను, కరివేపాకు - 4 రెబ్బలు, ఇంగువ - పావు టీ స్పూను.
తయారుచేసే విధానం: బియ్యాన్ని కాస్త మెత్తగా, పప్పును మామూలుగా ఉడికించుకుని పక్కనుంచుకోవాలి. కడాయిలో నూనె వేసి తాలింపుగింజలు, ఇంగువ, కరివేపాకు వేగనిచ్చి, తరిగిన కూరగాయల ముక్కలు కూడా వేసి సన్నని మంటపై కాస్త మెత్తబడేదాకా వేగనివ్వాలి (కాప్సికం లేకుండా). చింతపండు, ఉప్పు, కొబ్బరి తురుము, మసాలాపొడి వేసి మరికాసేపు వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన అన్నం, (మెదిపిన) పప్పును కలపాలి. కాప్సికంను విడిగా నేతిలో ఒక నిమిషం పాటు వేగించి బిస్‌బేలాబాత్‌పై అలంకరించుకోవాలి. దీనితో అప్పడాలు నంజుకుంటూ, ఉల్లి రైతాతో తింటే చాలా బాగుంటుంది.

Updated Date - 2015-08-30T00:07:30+05:30 IST