సోయిగూర ఆలూ దిల్‌

ABN , First Publish Date - 2015-09-04T16:43:44+05:30 IST

కావలసిన పదార్థాలు: ఆలుగడ్డలు - 3, సోయికూర తరుగు - అర కప్పు, వెల్లుల్లి తరుగు- అర టీ స్పూను

సోయిగూర ఆలూ దిల్‌

కావలసిన పదార్థాలు: ఆలుగడ్డలు - 3, సోయికూర తరుగు - అర కప్పు, వెల్లుల్లి తరుగు- అర టీ స్పూను, జీలకర్ర - అర టీ స్పూను, కారం - అర టీ స్పూను, ధనియాలపొడి - అర టీ స్పూను, ఉప్పు - అర టీ స్పూను, నూనె - 2 టీ స్పూన్లు.
తయారుచేసే విధానం: ఆలు తొక్కతీసి ఒక మోస్తరు ముక్కలుగా కట్‌ చేయాలి. కడాయిలో జీలకర్ర, వెల్లుల్లి, ఆలు ముక్కలు ఒకదాని తర్వాత ఒకటి వేగించి కారం, ధనియాలపొడి, ఉప్పు కలపాలి. ముక్కలు సగం ఉడికిన తర్వాత సోయికూర తరుగు వేసి సన్న మంటపైన 10 నిమిషాలు ఉంచి దించేయాలి. ఈ కూర చపాతీల్లోకి లేదా అన్నంతో నంజుకోడానికి బాగుంటుంది.

Updated Date - 2015-09-04T16:43:44+05:30 IST