Advertisement
Advertisement
Abn logo
Advertisement

కార్న్‌ పలావ్‌

v>మసాలాకు కావలసిన పదార్థాలు
 
ఉల్లి పాయలు: రెండు(ముక్కలుగా చేసుకోవాలి), టమోటాలు: రెండు(ముక్కలుగా చేసుకోవాలి), వెల్లుల్లి రెమ్మలు: నాలుగు, అల్లం: చిన్న ముక్క, గరంమసాలా పొడి: టేబుల్‌ స్పూను, కారం: టేబుల్‌ స్పూను, ధనియాల పొడి: టేబుల్‌ స్పూను, పచ్చిమిరపకాయలు: రెండు
 
పలావ్‌కు కావలసిన పదార్థాలు

బాసుమతి బియ్యం: కప్పు, అమెరికన్‌ కార్న్‌ గింజలు: ముప్పావు కప్పు, ఉల్లిపాయలు: రెండు(ముక్కలు చేసుకోవాలి), బఠాణీలు: పావుకప్పు, యాలకులు: రెండు లేదా మూడు, జీడిపప్పు: పది పప్పులు, దాల్చినచెక్క: చిన్నది, లవంగాలు: మూడు లేదా నాలుగు, కుంకుమపువ్వు: కొద్దిగా, కొత్తిమీర: కొద్దిగా, పాలు: టేబుల్‌ స్పూను, నెయ్యి: తగినంత, ఉప్పు: రుచికి సరిపడ
 
తయారీ విధానం
 
ముందుగా మసాలా దినుసులన్నీ మెత్తగా రుబ్బుకుని పక్కన పెట్టు కోవాలి. పాలలో కుంకుమ పువ్వు వేసి పది నిమిషాలు నాననివ్వాలి. బియ్యం శుభ్రం చేసి కడుక్కుని కనీసం అరగంట పాటు నాననివ్వాలి. ఇప్పుడు కుక్కర్‌లో నెయ్యి వేసి కాగిన తరువాత యాలకులు, లవంగాలు, దాల్చినచెక్క, జీడిపప్పు వేసి వేగనివ్వాలి. అనంతరం ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఇవి వేగిన తరువాత రుబ్బిపెట్టుకున్న మసాలా, అమెరికన్‌ కార్న్‌ వేసి కొద్దిసేపు వేగనిచ్చి బియ్యం కూడా జతచేయాలి. కప్పు బియ్యానికి రెండుకప్పుల నీరు పోసి కుక్కర్‌లో రెండు లేదా మూడు విజిల్స్‌ వచ్చే వరకూ వుంచి దించేయాలి. దించిన తరువాత మూత తీసి కొత్తిమీర చల్లి బిర్యాని మొత్తం కలియపెట్టుకోవాలి.
 
 

సఖి కేంద్రాల ద్వారా సత్వర న్యాయంకుమరం భీం పోరాట స్ఫూర్తితో హక్కుల సాధించుకోవాలిఎమ్మెల్యే కోనప్పకు సన్మానం క్రీడలతో మానసికోల్లాసం‘దళితబంధు’కు కసరత్తుఅట్రాసిటీ కేసుపై ఏసీపీ విచారణ ఖానాపూర్‌ మున్సిపాలిటీగా అవతరించిన నాటి నుంచే అభివృద్ధిటీకాతోనే కరోనా నియంత్రణ సాధ్యం బాల్క సుమన్‌కు సన్మానం దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి
Advertisement