పచ్చి బఠాణీ పలావ్‌

ABN , First Publish Date - 2015-10-31T15:45:07+05:30 IST

కావలసిన పదార్థాలు: బాసుమతీ రైస్‌: రెండుకప్పులు(ఉడికించి పెట్టుకోవాలి), ఉల్లిపాయ: ఒకటి(ముక్కలు చేసుకోవాలి)బంగాళదుంప:రెండు(ముక్కలుగా చేసుకొని ఉడికించి పెట్టుకోవాలి) పచ్చిమిర్చి:

పచ్చి బఠాణీ పలావ్‌

కావలసిన పదార్థాలు
 
బాసుమతీ రైస్‌: రెండుకప్పులు(ఉడికించి పెట్టుకోవాలి), ఉల్లిపాయ: ఒకటి(ముక్కలు చేసుకోవాలి)బంగాళదుంప:రెండు(ముక్కలుగా చేసుకొని ఉడికించి పెట్టుకోవాలి) పచ్చిమిర్చి: నాలుగు(ముక్కలు చేసుకోవాలి) పచ్చిబఠాణీ: అరకప్పు(ఉడికించుకోవాలి), దాల్చినచెక్క: చిన్నది, లవంగాలు: మూడు లేదా నాలుగు, మిరియాల పొడి: కొద్దిగా, నూనె: తగినంత, ఉప్పు: రుచికి సరిపడ.
 
తయారీ విధానం
 
మందపాటి గిన్నె లేదా బాండీ తీసుకొని నూనె వేసి కాగిన తరువాత జీలకర్ర, పచ్చిమిరపకాయ ముక్కలు, దాల్చినచెక్క, లవంగాలు వేసుకొని కొద్దిసేపు వేగనివ్వాలి. ఇప్పుడు ఉల్లిపాయముక్కలు కూడా వేసుకొని బంగారురంగువచ్చే వరకూ వేయించుకోవాలి. తరువాత బంగాళాదుంప ముక్కలు, బఠాణీలు, ఉప్పు, మిరియాల పొడి వేసి రెండు నిమిషాలు ఉడికించి అనంతరం రెడీగా వున్న అన్నం జత చేసి బాగా కలపాలి. ఓ నిమిషం పాటు పొయ్యి మీద వుంచి దించేసుకోవాలి. కొత్తిమీర, పుదీనాతో గార్నిష్‌ చేసుకుని వేడివేడిగా తింటే బాగుంటుంది.
 
 
 

Updated Date - 2015-10-31T15:45:07+05:30 IST