సపోటా ఖీర్‌

ABN , First Publish Date - 2015-09-03T17:25:51+05:30 IST

కావలసిన పదార్థాలు: పాలు - ఒక లీటరు, పంచదార - 3 టేబుల్‌ స్పూన్లు,

సపోటా ఖీర్‌

కావలసిన పదార్థాలు: పాలు - ఒక లీటరు, పంచదార - 3 టేబుల్‌ స్పూన్లు, సపోట పండ్లు - 4, కుంకుమపువ్వు - కొద్దిగా
తయారుచేసే విధానం
దళసరి అడుగున్న ఒక పాత్రలో పాలను పోసి, చిన్న మంటపైన పాలు సగానికి సగం అయ్యేలా మరిగించాలి. ఈలోపుగా సపోటాలని పొడుగాటి ముక్కలుగా కోసుకొని, గింజల్ని తీసేసి రడీగా ఉంచుకోవాలి. పాలు సగం అయ్యాక పంచదారని కలిపి మొత్తం కరిగేదాకా తిప్పాలి. సపోటా పళ్ల ముక్కల్ని వేసి మరో రెండు మూడు నిమిషాలు స్టౌ పైనే ఉంచాలి. సపోటాలు చిన్న చిన్న ముక్కలు కాకుండా చూసుకోవాలి. దించాక ఈ ఖీర్‌ను కుంకుమ పువ్వుతో అలంకరించాలి. వేడి తగ్గాక, ఫ్రిజ్‌లో పెట్టి చల్లగా అయ్యాక తింటే చాలా రుచిగా ఉంటుంది.

Updated Date - 2015-09-03T17:25:51+05:30 IST