కొబ్బరి ఆలు కుర్మా

ABN , First Publish Date - 2015-11-13T15:37:14+05:30 IST

కావలసిన పదార్థాలు: ఉడికించిన ఆలు - 1/4 కిలో, పచ్చికొబ్బరి తురుము - 1 కప్పు, తరిగిన పచ్చిమిర్చి - 6, ఉల్లిపాయ - తరిగినది ఒకటి, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ - 1/2 టీ స్పూను, వెన్న - 1 టేబుల్‌ స్పూను, లవంగాలు

కొబ్బరి ఆలు కుర్మా

కావలసిన పదార్థాలు: ఉడికించిన ఆలు - 1/4 కిలో, పచ్చికొబ్బరి తురుము - 1 కప్పు, తరిగిన పచ్చిమిర్చి - 6, ఉల్లిపాయ - తరిగినది ఒకటి, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ - 1/2 టీ స్పూను, వెన్న - 1 టేబుల్‌ స్పూను, లవంగాలు - 6, ఏలకులు - 4, దాల్చిన చెక్క - 1, ధనియాలు, జీరాపొడి - ఒక్కో టీ స్పూను, పుదీనా - ఒక కట్ట, ఉప్పు, పసుపు - తగినంత
తయారు చేయు విధానం: మూకుడులో వెన్నవేసి కరిగించి, జీలకర్ర, లవంగాలు, ఏలకులు, దాల్చిన చెక్క, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి, ఆలు ముక్కలు వేసి కొద్దిగా వేయించాలి. తర్వాత పచ్చికొబ్బరిని మెత్తగా పేస్ట్‌ చేసి వేయాలి. దానితోపాటు కొద్దిగా నీరు పోయాలి. తర్వాత ఉప్పు, పసుపు, పుదీనా వేసి బాగా కలిశాక దించేయాలి. ఇది పూరీ, చపాతీల్లోకి బాగుంటుంది.

Updated Date - 2015-11-13T15:37:14+05:30 IST