మునగాకు పప్పు

ABN , First Publish Date - 2015-12-08T15:09:31+05:30 IST

కావలసిన పదార్థాలు: పెసరపప్పు - ఒక కప్పు, మునగ ఆకు సన్నగా తరిగినది - ఒక కప్పు, పచ్చిమిరపకాయలు - 3 లేక 4, పసుపు - చిటికెడు, ఉప్పు - తగినంత, నిమ్మచెక్క -

మునగాకు పప్పు

కావలసిన పదార్థాలు: పెసరపప్పు - ఒక కప్పు, మునగ ఆకు సన్నగా తరిగినది - ఒక కప్పు, పచ్చిమిరపకాయలు - 3 లేక 4, పసుపు - చిటికెడు, ఉప్పు - తగినంత, నిమ్మచెక్క - ఒకటి, నూనె - తగినంత, పోపు గింజలు - టీ స్పూను.
తయారుచేయు విధానం: ముందుగా ఒక గిన్నెలో పెసరపప్పును ఉడికించుకోవాలి. అది ఉడికే సమయంలో అందులో వరసగా మునగ ఆకు, పసుపు, పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసి పప్పు పూర్తిగా ఉడికిన తర్వాత నిమ్మకాయ పిండాలి. ఆ తర్వాత స్టవ్‌పై కడాయి ఉంచి అందులో కాస్త, పోపు గింజలు వేసి వేగించి పప్పులో కలపాలి. కొత్తిమీరతో గార్నిష్‌ చేసుకోవాలి.

Updated Date - 2015-12-08T15:09:31+05:30 IST