సగ్గుబియ్యం-పెరుగు వడలు

ABN , First Publish Date - 2016-01-05T16:21:17+05:30 IST

కావలసిన పదార్థాలు: పెరుగు రెండు కప్పులు, సగ్గుబియ్యం కప్పు, బియ్యం పిండి కప్పు, పసుపు చెంచా, ఉల్లిపాయలు రెండు, కొత్తిమీర కట్ట, కరివేపాకు రెండు రెమ్మలు,

సగ్గుబియ్యం-పెరుగు వడలు

కావలసిన పదార్థాలు: పెరుగు రెండు కప్పులు, సగ్గుబియ్యం కప్పు, బియ్యం పిండి కప్పు, పసుపు చెంచా, ఉల్లిపాయలు రెండు, కొత్తిమీర కట్ట, కరివేపాకు రెండు రెమ్మలు, పచ్చిమిర్చి నాలుగు, ఉప్పు తగినంత , జీలకర్ర చిటికెడు
నూనె పావుకేజీ.
తయారుచేయు విధానం: సగ్గుబియ్యాన్ని పెరుగులో రెండు గంటల పాటు నానబెట్టాలి. తరువాత బియ్యం పిండి తీసుకుని నానిన సగ్గు బియ్యాన్ని పిండిలో కలిపి దానిని వడల పిండిలా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో పైన పేర్కొన పదార్థాలన్నింటినీ వేసి బాగా కలపాలి. అనంతరం ఓ బాణలిలో నూనె వేసి కాగిన తరువాత ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న వడల్లా చేసుకుని నూనెలో వేసి ఎర్రగా వేయించి తీసేయాలి. అంతే సగ్గుబియ్యం పెరుగు వడలు నోరూరిస్తూ సిద్ధం అవుతాయి.

Updated Date - 2016-01-05T16:21:17+05:30 IST