చింతచిగురు పులిహోర

ABN , First Publish Date - 2016-05-11T15:17:09+05:30 IST

కావలసినవి: బియ్యం - 2 కప్పులు, చింతచిగురు - కప్పు, శనగపప్పు - టేబుల్‌ స్పూన, మినప్పప్పు - టేబుల్‌ స్పూన, ధనియాలు - టేబుల్‌ స్పూన, ఎండుమిర్చి - 4, నువ్వులు

చింతచిగురు పులిహోర

కావలసినవి: బియ్యం - 2 కప్పులు, చింతచిగురు - కప్పు, శనగపప్పు - టేబుల్‌ స్పూన, మినప్పప్పు - టేబుల్‌ స్పూన, ధనియాలు - టేబుల్‌ స్పూన, ఎండుమిర్చి - 4, నువ్వులు - టేబుల్‌ స్పూన, నూనె - 2 టేబుల్‌ స్పూన్లు, ఉప్పు - తగినంత, కరివేపాకు - 2 రెమ్మలు.
 
తయారీ: చింత చిగురును శుభ్రంగా కడిగి ఆరనివ్వాలి. వీలైతే కాస్త ఎండలో పెడితే మంచిది. తరువాత కాస్త నూనెలో వేయించి పక్కన పెట్టుకోవాలి. బాణలిలో నువ్వులు, మినప్పప్పు, ధనియాలు, శనగపప్పు వేసి వేయించాలి. చివరగా ఎండుమిర్చి కూడా వేసి వేయించి దించాలి. చల్లారిన తర్వాత వీటితోపాటు చింతచిగురు కూడా మిక్సీలో వేసి పొడి చేసి ఉంచాలి. అన్నం ఉడికించి ఉంచాలి. బాణలిలో నూనె పోసి కాగాక పోపు దినుసులన్నీ వేసి వేయించాలి. తరువాత చింతచిగురు పొడి, ఉప్పు, కరివేపాకు వేసి ఓ నిమిషం వేగాక ఉడికించిన అన్నం వేసి కలిపి దించాలి. అంతే, టేస్టీ టేస్టీ పులిహోర రెడీ!

Updated Date - 2016-05-11T15:17:09+05:30 IST