స్టఫ్డ్ బేండీ

ABN , First Publish Date - 2016-11-19T21:02:20+05:30 IST

స్టఫ్డ్ బేండీ

స్టఫ్డ్ బేండీ

కావలసిన పదార్థాలు: పెద్ద సైజు బెండకాయలు- పావు కిలో, నూనె- అర కప్పు, జీలకర్ర- రెండు టీ స్పూన్లు, కరివేపాకు- కొద్దిగా,
తరిగిన ఉల్లిపాయ- ఒకటి, శనగపిండి- పావు కప్పు, అల్లం- అంగుళం ముక్క, పసుపు- పావు టీ స్పూను, ధనియాల పొడి- ఒక టీ స్పూను, జీలకర్ర పొడి- ఒక టీ స్పూను, సోంపు- ఒక టీ స్పూను, నిమ్మరసం- రెండు టేబుల్‌ స్పూన్లు, కొత్తిమీర- ఒక కట్ట, నువ్వుల పొడి- రెండు టేబుల్‌ స్పూన్లు, ఉప్పు- తగినంత.

తయారీ విధానం:
ఒక బాణలిలో బెండకాయలు, నూనె, జీలకర్ర, కరివేపాకు మినహా మిగిలిన పదార్థాలన్నిటినీ వేసి కొన్ని నీళ్లు పోసుకుని బాగా కలపాలి. తర్వాత బెండకాయలను నిలువుగా కోసి మధ్యలో శనగపిండి మిశ్రమం పెట్టాలి. ఆ తర్వాత ఒక పెనంలో నూనె పోసి వేడెక్కాక జీలకర్ర, కరివేపాకు వేసి వేగించాలి. తర్వాత బెండకాయలను వేసి రెండు వైపులా ముదురు రంగు వచ్చేదాకా వేగించాలి. వేడి వేడి అన్నంలో నంజుకొని తింటే భలేరుచిగా ఉంటుంది.

Updated Date - 2016-11-19T21:02:20+05:30 IST