కాలీ ఫ్లవర్ రైస్

ABN , First Publish Date - 2017-02-13T00:48:24+05:30 IST

కావలసిన పదార్థాలు కాలీఫ్లవర్‌ ముక్కలు- 2 కప్పులు, బియ్యం- 2 కప్పులు, బఠాణీలు- అరకప్పు, పచ్చిమిర్చి-

కాలీ ఫ్లవర్ రైస్

కావలసిన పదార్థాలు
కాలీఫ్లవర్‌ ముక్కలు- 2 కప్పులు, బియ్యం- 2 కప్పులు, బఠాణీలు- అరకప్పు, పచ్చిమిర్చి- 5, జీలకర్ర- అర టీస్పూను, అల్లంవెల్లుల్లి ముద్ద- అర టీస్పూను, పసుపు- చిటికెడు, గరం మసాలా- 1 టీస్పూను, కొత్తిమీర- కొద్దిగా, నూనె- 2 టేబుల్‌స్పూన్లు, ఉప్పు- తగినంత.
 
తయారీ విధానం
బియ్యాన్ని పొడిపొడిగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఉప్పు, పసుపు వేసి కాలీఫ్లవర్‌ ముక్కలను 10 నిమిషాలు ఉడికించి ఆరబెట్టుకోవాలి. తర్వాత కొద్దిగా నూనె వేసి ముదురు ఎరుపు రంగు వచ్చే దాకా వేగించాలి. బాణలిలో నూనె పోసి వేడెక్కాక జీలకర్ర, అల్లంవెల్లుల్లి ముద్ద, పచ్చిమిర్చి, బఠాణీలు వేసి 2 నిమిషాలు వేగించాలి. తర్వాత కాలిఫ్లవర్‌ ముక్కలు, అన్నం, గరం మసాలా, ఉప్పు వేసి మరో 5 నిమిషాలు ఉంచి కొత్తిమీర వేసి దించేయాలి.

Updated Date - 2017-02-13T00:48:24+05:30 IST