బ్రెడ్‌ దహీవడ

ABN , First Publish Date - 2017-08-05T19:48:37+05:30 IST

బ్రెడ్‌ స్లయి్‌సలు - ఎనిమిది, పెరుగు - నాలుగు కప్పులు, ఎండుద్రాక్ష(కిస్మిస్‌) - రెండు టేబుల్‌ స్పూన్లు, కారం, వేగించిన జీలకర్ర పొడి...

బ్రెడ్‌ దహీవడ

కావలసినవి:
 
బ్రెడ్‌ స్లయి్‌సలు - ఎనిమిది, పెరుగు - నాలుగు కప్పులు, ఎండుద్రాక్ష(కిస్మిస్‌) - రెండు టేబుల్‌ స్పూన్లు, కారం, వేగించిన జీలకర్ర పొడి - ఒక్కోటి ఒక్కో టీస్పూన్‌ చొప్పున, చింతపండు గుజ్జు - అర కప్పు (కొంచెం పంచదార కలపాలి), ఉప్పు, పంచదార - రుచికి సరిపడా, నూనె - వేగించడానికి సరిపడా, కొత్తిమీర తరుగు - రెండు టేబుల్‌ స్పూన్లు.
 
తయారీ:
బ్రెడ్‌ నలువైపులా ఉన్న గట్టి భాగాన్ని తీసేయాలి. తరువాత బ్రెడ్‌లో కొంచెం పెరుగు, ఉప్పు వేసి మెత్తటిమద్ద చేయాలి. చిన్న చిన్న ఉండలు చేసి మధ్యలో ఎండుద్రాక్షని ఉంచాలి. నూనె వేడిచేసి బ్రెడ్‌ వడల్ని కరకరలాడేట్టు వేగించి పక్కన పెట్టాలి.
మిగిలిన పెరుగులో ఉప్పు, పంచదార వేసి కలపాలి. ఇందులో వేగించిన బ్రెడ్‌ వడలను వేయాలి. కారం, జీలకర్ర పొడి పైన చల్లాలి, చింతపండు గుజ్జు పోయాలి.
కొత్తిమీర తరుగుతో అలంకరించి తింటే యమ్మీయమ్మీగా ఉంటుంది.

Updated Date - 2017-08-05T19:48:37+05:30 IST