మసాలా స్వీట్‌కార్న్‌

ABN , First Publish Date - 2017-08-16T18:12:05+05:30 IST

కార్న్‌ కండెలు- 3 (లేతగా ఉన్నవి), నెయ్యి- 1 టీస్పూన్‌. ఉప్పు- రుచికి తగినంత గరం మసాలా..

మసాలా స్వీట్‌కార్న్‌

కావలసిన పదార్థాలు
 
కార్న్‌ కండెలు- 3 (లేతగా ఉన్నవి), నెయ్యి- 1 టీస్పూన్‌. ఉప్పు- రుచికి తగినంత గరం మసాలా- పావు టీస్పూన్‌.
 
తయారీ విధానం
 
స్వీట్‌కార్న్‌ గింజలను మరీ మెత్తగా కాకుండా ఉడకబెట్టాలి. తర్వాత ఓ ప్యాన్‌ తీసుకుని నెయ్యి వేయాలి. అందులో మొక్కజొన్న గింజలను వేసి కలియబెట్టాలి. ఆ తర్వాత గింజలు గట్టిగా ఉన్నాయనుకుంటే అందులో కాసిని నీటిని చిలకరిస్తూ గరిటెతో కలియబెట్టాలి. ఆ తర్వాత ఉప్పు, గరం మసాలా వేసి బాగా మిక్స్‌ చేయాలి. ఆ తర్వాత పేపర్‌ కప్పుల్లో వేసుకోవాలి. సాయంకాలం పూట సరదాగా ఈ యమ్మీ స్వీట్‌కార్న్‌ను తింటే ఆ మజాయే వేరు.

Updated Date - 2017-08-16T18:12:05+05:30 IST