ఫూల్‌ మఖానా కర్రీ

ABN , First Publish Date - 2017-08-12T21:58:17+05:30 IST

ఫూల్‌ మఖానా - రెండు కప్పులు, ఉల్లిపాయ - 1, టమోటా - 1, అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టీ స్పూను, కారం - ఒక టీ స్పూను, పసుపు - పావు టీ

ఫూల్‌ మఖానా కర్రీ

కావలసిన పదార్థాలు
 
ఫూల్‌ మఖానా - రెండు కప్పులు, ఉల్లిపాయ - 1, టమోటా - 1, అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టీ స్పూను, కారం - ఒక టీ స్పూను, పసుపు - పావు టీ స్పూను, ధనియాల పొడి - ఒక టీ స్పూను, పెరుగు - పావు కప్పు, కొత్తిమీర తరుగు - పావు కప్పు, పచ్చిబఠాణి - పావు కప్పు, ఉప్పు - రుచికి తగినంత, జీడిపప్పు - 10, నూనె/బటర్‌ - 4 టేబుల్‌ స్పూన్లు, జీలకర్ర - ఒక టీ స్పూను.
 
తయారుచేసే విధానం
 
ఫూల్‌ మఖానా దోరగా వేగించి పక్కనుంచాలి. 2 టేబుల్‌ స్పూన్ల నూనెలో ఉల్లితరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, టమోటా తరుగు, కారం, ధనియాలపొడి, ఉప్పు, పసుపు, జీడిపప్పు ఒకటి తర్వాత ఒకటి వేస్తూ వేగించి దించేయాలి. చల్లారిన తర్వాత మిక్సీలో మెత్తగా పేస్టు చేసుకోవాలి. ఇప్పుడు పాన్‌లో మిగతా నూనె వేసి జీలకర్రతో తాలింపు వేసి రుబ్బిన పేస్టు కలిపి చిన్న మంటపై 5 నిమిషాలు ఉంచాలి. తర్వాత పచ్చిబఠాణి వేసి ఒక కప్పు నీళ్లు పోసి మూత పెట్టాలి. తర్వాత ఫూల్‌ మఖానా, పెరుగు కలిపి మరో 5 నిమిషాలుంచి కొత్తిమీర చల్లి దించేయాలి. ఈ కర్రీ బ్రెడ్‌, లేదా చపాతీల్లోకి చాలారుచిగా ఉంటుంది.

Updated Date - 2017-08-12T21:58:17+05:30 IST