పచ్చికొబ్బరితో పొట్లకాయ కూర

ABN , First Publish Date - 2017-10-07T23:44:20+05:30 IST

పొట్లకాయ (చిన్న) ముక్కలు - రెండున్నర కప్పులు, పచ్చికొబ్బరి తురుము - అర కప్పు....

పచ్చికొబ్బరితో పొట్లకాయ కూర

కావలసిన పదార్థాలు
పొట్లకాయ (చిన్న) ముక్కలు - రెండున్నర కప్పులు, పచ్చికొబ్బరి తురుము - అర కప్పు, (నానబెట్టి, ఉడికించిన) శనగపప్పు - ఒక టేబుల్‌ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, నూనె - 4 టీ స్పూన్లు, మినప్పప్పు - 2 టీ స్పూన్లు, ఆవాలు, జీలకర్ర - ఒక స్పూను చొప్పున, ఎండుమిర్చి - 4, (ఇష్టమైతే) కారం - పావు టీ స్పూను, పసుపు - చిటికెడు, కరివేపాకు - 4 రెబ్బలు.
 
తయారుచేసే విధానం
ముందుగా పొట్లకాయ ముక్కల్లో కొద్దినీరు, చిటికెడు ఉప్పు చేర్చి ఉడికించి వార్చాలి. తర్వాత కడాయిలో నూనె వేసి మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు, కారం, ఉప్పుతో తాళింపు పెట్టి పొట్లకాయ ముక్కలతో పాటు ఉడికించిన శనగపప్పు వేసి కొద్దిసేపు వేగించాలి. దించేముందు కొబ్బరి తురుము కలిపి దించేయాలి. ఈ కూర వేడివేడి అన్నంతో నెయ్యి వేసుకుని తింటే బాగుంటుంది.

Updated Date - 2017-10-07T23:44:20+05:30 IST