కందగడ్డ బచ్చలి కూర

ABN , First Publish Date - 2017-10-14T22:33:05+05:30 IST

కంద - అర కేజీ, బచ్చలి తరుగు - 4 కప్పులు, పచ్చిమిర్చి - 4, చింతపండు రసం - 2 టేబుల్‌ స్పూన్లు, పసుపు...

కందగడ్డ బచ్చలి కూర

కావలసిన పదార్థాలు
 
కంద - అర కేజీ, బచ్చలి తరుగు - 4 కప్పులు, పచ్చిమిర్చి - 4, చింతపండు రసం - 2 టేబుల్‌ స్పూన్లు, పసుపు - అర టీ స్పూను, పంచదార, ఆవాలు - ఒక టేబుల్‌ స్పూను 
చొప్పున, ఉప్పు - రుచికి తగినంత. తాళింపు కోసం : ఆవాలు, శనగప్పు, మినప్పప్పు, ఎండు మిర్చి, కరివేపాకు, నూనె - సరిపడా.
 
తయారుచేసే విధానం
 
శుభ్రం చేసిన కందను చిన్న చిన్న ముక్కలుగా తరిగి పసుపు వేసి, తగినంత నీటితో 3 విజిల్స్‌ వచ్చేవరకు ఉడికించి పక్కనుంచాలి (చల్లారిన తర్వాత మెదపాలి. పేస్టుగా చేయకూడదు). కడాయిలో పోపు వేసి, బచ్చలి తరుగు కూడా వేసి ఆకులు మెత్తబడేవరకు వేగించాలి. తర్వాత చింతపండు రసం వేసి 5 నిమిషాల తర్వాత కంద ముక్కలు, పంచదార, ఉప్పు వేసి బాగా కలిపి మరో 5 నిమిషాలు ఉడికించాలి. దించేముందు విడిగా (4 నూనె చుక్కలు వేసి రుబ్బుకున్న) ఆవ పేస్టు కలిపి దించేయాలి.

Updated Date - 2017-10-14T22:33:05+05:30 IST