పైనాపిల్‌ ఫ్రైడ్‌ రైస్‌

ABN , First Publish Date - 2018-03-31T23:25:52+05:30 IST

అన్నం - 2 కప్పులు, పైనాపిల్‌ ముక్కలు- 1 కప్పు, పచ్చిమిర్చి - 2, ఉల్లిపాయ - 1, వెల్లుల్లి...

పైనాపిల్‌ ఫ్రైడ్‌ రైస్‌

కావలసిన పదార్థాలు
 
అన్నం - 2 కప్పులు, పైనాపిల్‌ ముక్కలు- 1 కప్పు, పచ్చిమిర్చి - 2, ఉల్లిపాయ - 1, వెల్లుల్లి - 2 రెబ్బలు, సోయాసాస్‌ - 1 టేబుల్‌ స్పూన్‌, చిల్లిసాస్‌ - 1 టేబుల్‌ స్పూన్‌, క్యారెట్‌ - 1, పచ్చిబఠాణి - 1/4 కప్పు, కొత్తిమీర - తగినంత, ఉప్పు - రుచికి, నూనె - 2 టేబుల్‌ స్పూన్లు.
 
తయారుచేసే విధానం
 
ఉడికించిన అన్నం ఫ్రిజ్‌లో పెట్టండి. దీనివల్ల ఫ్రైడ్‌ రైస్‌ చేసేప్పుడు మెతుకులు విరిగిపోకుండా, పొడిగా ఉంటాయి. కూరగాయల్ని సన్నగా తరగండి. పాన్లో నూనె వేడిచేసి ఉల్లి, పచ్చిమిర్చి, వెల్లుల్లి తరుగు వేగించండి. తర్వాత క్యారెట్‌ తరుగు, బఠాణి వేసి వేగించండి. ఇప్పుడు పైనాపిల్‌ ముక్కలు, సోయాసాస్‌, చిల్లీ సాస్‌ కలపండి. ఆ తర్వాత అన్నం, ఉప్పు వేసి బాగా కలపండి. రైస్‌ వేడెక్కిన తరువాత మంట ఆపేయండి. ఫ్రైడ్‌ రైస్‌ను వడ్డించేముందు కొత్తిమీర చల్లండి. ఇష్టమైతే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు.

Updated Date - 2018-03-31T23:25:52+05:30 IST