చామదుంప ఇగురు

ABN , First Publish Date - 2018-08-04T21:44:52+05:30 IST

చామదుంపలు - పావు కిలో, నూనె - 3 టేబుల్‌ స్పూన్లు, టమోటాలు - 2, జీలకర్ర - ఒక టీ స్పూను..

చామదుంప ఇగురు

కావలసిన పదార్థాలు
 
చామదుంపలు - పావు కిలో, నూనె - 3 టేబుల్‌ స్పూన్లు, టమోటాలు - 2, జీలకర్ర - ఒక టీ స్పూను, అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టీ స్పూను, మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు - ఘాటుకు సరిపడా, ధనియాల పొడి, కారం - అర టీ స్పూను చొప్పున, పసుపు - పావు టీస్పూను, ఉప్పు - రుచికి తగినంత, పచ్చిమిర్చి - 2, గరం మసాలా - అర టీ స్పూను, కొత్తిమీర తరుగు - పావు కప్పు.
 
తయారుచేసే విధానం
 
చామదుంపలు ఉడికించి, తొక్కతీసి ముక్కలుగా తరిగి పక్కనుంచాలి. కడాయిలో కొద్దిగా నూనె వేసి ఉల్లితరుగు వేగించి, టమోటాలు, జీలకర్రతో పాటు మిక్సీలో పేస్టు చేయాలి. అదే కడాయిలో మిగతా నూనె వేసి అల్లం వెల్లుల్లి పేస్టు, మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు ఒక నిమిషం వేగించాలి. తర్వాత ధనియాల పొడి, కారం, పసుపు, ఉప్పుతో పాటు ఉల్లి పేస్టు కలపాలి. రెండు నిమిషాలు వేగాక ఒక కప్పు నీరు పోయాలి. గ్రేవీ చిక్కబడ్డాక దుంప ముక్కలు వేసి మూత పెట్టాలి. ఇగురు చిక్కబడ్డాక గరం మసాలా, చీరిన పచ్చిమిర్చి, కొత్తిమీర
తరుగు వేసి 3 నిమిషాల తర్వాత మంట తీసెయ్యాలి.

Updated Date - 2018-08-04T21:44:52+05:30 IST