బనానా కేక్‌

ABN , First Publish Date - 2015-08-29T22:47:03+05:30 IST

కావలసినవి: వెన్న- అరకప్పు, పంచదార- ఒక కప్పుగుడ్లు- రెండు, తెల్లసొన- ఒకటి

బనానా కేక్‌

కావలసినవి: వెన్న- అరకప్పు, పంచదార- ఒక కప్పుగుడ్లు- రెండు, తెల్లసొన- ఒకటి పాలు- రెండు టేబుల్‌ స్పూన్‌లు, వెనిలా - రెండు టీ స్పూన్‌లు, అరటి పండు గుజ్జు- ఒకటిన్నర కప్పు, మైదా - ఒకటిన్నర కప్పు, బేకింగ్‌ పౌడర్‌- ఒకటింబావు టీ స్పూన్‌, బేకింగ్‌ సోడా- అర టీ స్పూన్‌ఉప్పు - అర టీ స్పూన్‌.
తయారీ విధానం...
మైదా, బేకింగ్‌పౌడర్‌, బేకింగ్‌ సోడా, ఉప్పు అన్నీ కలిపి జల్లెడ పట్టి ఉంచుకోండి. పెద్దగిన్నెలో వెన్న, పంచదార మృదువుగా అయ్యేదాకా గిలకొట్టండి. గుడ్లు, తెల్లసొన కూడా వేసి నురగవచ్చేలా బాగా గిలకొట్టండి. తరువాత అందులో అరటిపండు గుజ్జు, వెనిలా, పాలు, మైదా వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని రెండు భాగాలు చేసి తొమ్మిది అంగుళాల పాన్‌లలో సర్ది ఓవెన్‌లో 350 డిగ్రీల దగ్గర అరగంటసేపు బేక్‌ చేయండి. దీనిని కుక్కర్‌లో కూడా చేసుకోవచ్చు. చల్లారిన తరువాత క్రీంచీజ్‌తో అలంకరించి తింటే భలే రుచిగా ఉంటుంది.

Updated Date - 2015-08-29T22:47:03+05:30 IST