కోకొనట్‌ స్ర్టాబెరీ కేక్‌

ABN , First Publish Date - 2015-08-30T16:41:23+05:30 IST

కావలసినవి: మైదా - 225గ్రా., బేకింగ్‌ పౌడర్‌ - ఒకటిన్నర టీ స్పూన్‌, చిక్కటి పెరుగు - ఒక కప్పు, పంచదార - 140 గ్రా

కోకొనట్‌  స్ర్టాబెరీ  కేక్‌

కావలసినవి: మైదా - 225గ్రా., బేకింగ్‌ పౌడర్‌ - ఒకటిన్నర టీ స్పూన్‌, చిక్కటి పెరుగు - ఒక కప్పు, పంచదార - 140 గ్రా.,, పాలు - 5, 6 టేబుల్‌ స్పూన్‌లు , కరిగించిన వెన్న 115 గ్రా. కావాలంటే సన్‌ఫ్లవర్‌ నూనెని కూడా ఉపయోగించవచ్చు., నానబెట్టిన కుంకుమ పువ్వు చిటికెడు., గోరువెచ్చని పాలు మూడు టేబుల్‌ స్పూన్‌లు, తాజా కొబ్బరి తరుము- ఒక కప్పు, కిస్‌మిస్‌లు- 50 గ్రా., బాదం పలుకులు-50గ్రా.(పొట్టు తీసి చిన్న ముక్కలుగా తరిగినవి), రెండు చిటికెలు ఉప్పు, స్ర్టాబెర్రీ సాస్‌.. కేక్‌ పైన చిలకరించడానికి...
తయారీ విధానం:
మైదా, బేకింగ్‌ పౌడర్‌, ఉప్పు వేసి కలపి ఉంచుకోండి. మిక్సీలో పంచదార పొడిచేసి దానిలోనే పెరుగు, నూనె,కొబ్బరి వేసి మెత్తగా రుబ్బుకోండి. ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా మైదాలో వేసి ఉండలు కట్టకుండా కలుపుకోండి. కుంకుమ పువ్వు, కిస్‌మిస్‌లు, బాదం పలుకులు వేసి మరీ గట్టిగా కాకుండా కొంచెం పలుచగా గరిట జారుగా కలుపుకోవాలి. తరువాత దీనిని మీకు కావలసిన సైజు గిన్నెలో వేసుకుని పైన నున్నగా, చదరంగా ఉండేలా చాకుతో సర్దుకోవాలి. ముందుగానే వేడి చేసి ఉంచుకున్న ఓవెన్‌లో ఆ గిన్నెని ఉంచి 180 డిగ్రీ సెల్సియస్‌ దగ్గర 35-40 నిముషాల పాటు బేక్‌ చేయాలి. చాకుకి అంటుకోకుండా ఉంటే కేక్‌ తయారయినట్టే. తరవాత దానిమీద తాజా పళ్ల తో, స్ర్టా బెర్రీ సాస్‌తో, మీకిష్టమైన పద్దతిలో అలంకరించుకోవచ్చు. ఓవెన్‌ లేనివారు మామూలుగా కేకు తయారు చేసుకునే పద్ధతిలోనే దీన్నీ తయారు చేసుకోవచ్చు.

Updated Date - 2015-08-30T16:41:23+05:30 IST