దోసకాయ ఎండు రొయ్యలు

ABN , First Publish Date - 2015-08-30T18:00:11+05:30 IST

కావలసిన పదార్థాలు: ఎండు రొయ్యలు - 2 టేబుల్‌ స్పూన్లు, దోసకాయ ముక్కలు - 2 కప్పులు, ఉల్లి తరుగు - అర కప్పు

దోసకాయ ఎండు రొయ్యలు

కావలసిన పదార్థాలు: ఎండు రొయ్యలు - 2 టేబుల్‌ స్పూన్లు, దోసకాయ ముక్కలు - 2 కప్పులు, ఉల్లి తరుగు - అర కప్పు, టమోటా తరుగు - అరకప్పు, కారం - రెండు టీ స్పూన్లు, పసుపు - చిటికెడు, ఉప్పు - రుచికి తగినంత, నూనె - 1 టేబుల్‌ స్పూను, కొత్తిమీర తరుగు - 1 టేబుల్‌ స్పూను.
తయారుచేసే విధానం: రొయ్యల్ని అరగంటపాటు నానబెట్టి నీరు పిండేయాలి. నూనెలో ఉల్లితరుగు వేగించి, టమోటా ముక్కలు, పసుపు, ఉప్పు కలపాలి. టమోటాలు మెత్తబడ్డాక రొయ్యలు, దోస ముక్కలు, కారం వేసి మూత పెట్టాలి. రెండు నిమిషాల తర్వాత 3 కప్పులు నీరు పోయాలి. కూర చిక్కబడ్డాక కొత్తిమీర వేసి దించేయాలి. అన్నంతో ఎంతో రుచిగా ఉండే కర్రీ ఇది.

Updated Date - 2015-08-30T18:00:11+05:30 IST