క్యాబేజీ కూటు

ABN , First Publish Date - 2015-08-30T19:01:49+05:30 IST

కావలసిన పదార్థాలు: సన్నగా తరిగిన కాబేజీ - 2 కప్పులు, ఉడికించిన పెసరపప్పు - 4 టేబుల్‌ స్పూన్లు

క్యాబేజీ కూటు

కావలసిన పదార్థాలు: సన్నగా తరిగిన కాబేజీ - 2 కప్పులు, ఉడికించిన పెసరపప్పు - 4 టేబుల్‌ స్పూన్లు, ఆవాలు + మినప్పప్పు - 1 టీ స్పూను, కరివేపాకు - 4 రెబ్బలు, నూనె - 1 టేబుల్‌స్పూను. పచ్చికొబ్బరి కోరు పావుకప్పు, ఉల్లిపాయ -1, పచ్చిమిర్చి -2, జీలకర్ర - అర టీ స్పూను, బియ్యప్పిండి - అర టీ స్పూను.
తయారుచేసే విధానం: ముందుగా పచ్చికొబ్బరి, జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, బియ్యప్పిండి కలిపి గ్రైండ్‌ చేసి పెట్టుకోవాలి. కాబేజీ తరుగును 1 కప్పు నీటితో మెత్తగా ఉడికించాలి. తర్వాత ఇందులో వేరుగా ఉడికించి పెట్టుకున్న పెసరపప్పుని, కొబ్బరిముద్ద మిశ్రమాన్ని వేసి బాగా కలిపి కొద్దిసేపు సన్నటి సెగమీద ఉడికించాలి. తర్వాత ఆవాలు, మినప్పప్పు, కరివేపాకుతో గరిటె తాలింపు పెట్టి ఈ కూటులో కలపాలి. ఇది పరాటాల్లోకి చాలా బాగుంటుంది.

Updated Date - 2015-08-30T19:01:49+05:30 IST