Abn logo

క్యాబేజీ చట్నీ

కావలసిన పదార్థాలు :  క్యాబేజీ- సగభాగం, వేరుసెనగ పప్పు- పావు కప్పు, ఎండు మిరపకాయలు- 3, మినపపప్పు- 1 చెంచా, సెనగపప్పు- 1 చెంచా, ఇంగువ- అర చెంచా, ఉప్పు- తగినంత, నూనె- కొంచెం, ఆవాలు- అర చెంచా, కరివేపాకు- కొంచెం.
తయారీ విధానం :
రెండు లేదా మూడు చెంచాల నూనెని వేడిచేసి వేరుశెనగపప్పు, ఎండు మిర్చి వేయాలి. తర్వాత క్యాబేజీ తురుము వేసి పొడిగా అయ్యే వరకూ వేయించాలి. వీటిని చల్లార్చి కొద్దిగా నీరుపోసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు బాణలిలో మరో రెండు చెంచాల నూనె వేసి అందులో ఆవాలు, సెనగపప్పు, మినపపప్పు, కరివేపాకు వేసి వేయించాలి. అది వేగాక గ్రైండ్‌ చేసి పెట్టుకున్న మిశ్రమానికి జోడించాలి. చివరగా ఉప్పు, ఇంగువ వేసి ఐదు నిమిషాల తర్వాత దించుకోవాలి. ఇది అన్నం, ఇడ్లీ,దోసెల్లోకి చాలా బాగుంటుంది. క్యాబేజీ వాసన గిట్టని వారు కూడా దీన్ని ఇష్టంగా తింటారు.

టీఆర్‌ఎస్‌ పార్టీకి, ఏఎంసీ చైర్మన్‌ పదవికి రాజీనామా కడార్ల గంగనర్సయ్యపదవీకాలం పొడగించలేదనే అక్కసుతోనే. ..మంజులాపూర్‌లో మున్సిపల్‌ చైర్మన్‌ పర్యటనపోడు భూములకు పట్టాలివ్వాలిదళిత గిరిజన దండోరాను అడ్డుకుంటాంకొవిడ్‌ రహిత రాష్ట్ర నిర్మాణం కోసం కృషి నత్తనడకన పల్లెప్రగతి పనులుకోతకు గురైన రోడ్లుపోడు రైతుల సమస్యలను పరిష్కరించాలిగిరిజన దండోరాను విజయవంతం చేయాలి
Advertisement