క్యారెట్‌ ఆవకాయ

ABN , First Publish Date - 2015-08-30T20:37:11+05:30 IST

కావలసిన పదార్థాలు: క్యారెట్‌లు - అరకిలో, ఆవపిండి - ఒక టేబుల్‌ స్పూను, కారం -2 టేబుల్‌ స్పూన్లు

క్యారెట్‌ ఆవకాయ

కావలసిన పదార్థాలు: క్యారెట్‌లు - అరకిలో, ఆవపిండి - ఒక టేబుల్‌ స్పూను, కారం -2 టేబుల్‌ స్పూన్లు, ఉప్పు -1 టేబుల్‌ స్పూను, జీరాపొడి - ఒక టేబుల్‌ స్పూను, వెల్లుల్లి - అరపాయ, నిమ్మరసం - అరకప్పు, నూనె - సరిపడా.
తయారుచేయు విధానం: క్యారెట్లని శుభ్రంగా కడిగి ఆరబెట్టి చిన్న చిన్న ముక్కలుగా తరగాలి. ఒక గిన్నెలో ఆవపొడి, కారం, జీరా పొడి, ఉప్పు, వెల్లుల్లి రేకలు వేసి కలపాలి. ఈ మిశ్రమంలో క్యారెట్‌ ముక్కలు, సరిపడా నూనె వేసి బాగా కలపాలి. చివర్లో నిమ్మ రసం కలిపి జాడీలోకి తీసుకోవాలి. మూడవ రోజుకి రుచులూరే క్యారెట్‌ ఆవకాయ రెడీ.

Updated Date - 2015-08-30T20:37:11+05:30 IST