మామిడి రసమలాయ్‌

ABN , First Publish Date - 2015-08-31T18:34:38+05:30 IST

కావలసినవి: ఆల్ఫాన్సో మామిడి పండు ఒకటి, బ్రెడ్‌ స్లయిసెస్‌ 5, పాలు అరలీటరు, పాలపొడి ఒక కప్పు

మామిడి రసమలాయ్‌

కావలసినవి: ఆల్ఫాన్సో మామిడి పండు ఒకటి, బ్రెడ్‌ స్లయిసెస్‌ 5, పాలు అరలీటరు, పాలపొడి ఒక కప్పు, చక్కెర రెండు టేబుల్‌ స్పూన్లు, పిస్తాబద్దలు ఒక టీ స్పూను, ఆల్మండ్‌ ముక్కలు ఒక టీ స్పూను, కుంకుమ పువ్వు కొద్దిగా.
తయారుచేసే విధానం
మామిడిపండు తొక్కతీసి సన్నగా ముక్కలు కోసుకోండి. ఆల్మండ్‌ ముక్కల్ని కూడా దానిలోనే కలపండి. పాలను ఐదు నిమిషాలు కాగపెట్టి దానిలో పాలపొడి, చక్కెర కలిపి సన్నసెగ మీద మరో ఐదు నిమిషాలు ఉంచండి. ఆ తర్వాత కిందకు దించి చల్లారాక ఫ్రిజ్‌లో రెండు గంటల సేపు పెట్టండి. బ్రెడ్‌ అంచుల్ని తీసేసి బ్రెడ్‌ ముక్కల్ని కొద్దిగా తడపండి. మామిడి మిశ్రమాన్ని మధ్యలో పెట్టి ఉండలా చుట్టండి. వాటిని బౌల్‌లో వేసి పైన ఫ్రిజ్‌లో పెట్టిన చల్లటి పాలను పోయండి. పైన పిస్తా ముక్కలు, కుంకుమ పువ్వు చల్లి తినండి. చాలా బాగుంటుంది. మామిడి బదులు బొప్పాయి, కర్బూజా లాంటి పళ్ళను కూడా వాడొచ్చు.

Updated Date - 2015-08-31T18:34:38+05:30 IST