మటన్‌ కీమా బాల్స్‌

ABN , First Publish Date - 2015-09-01T17:41:45+05:30 IST

కావలసిన పదార్థాలు : మటన్‌ కీమా - 150 గ్రా., ఎండుమిర్చి - 2, పుట్నాలు - 1 టేబుల్‌ స్పూను, జీడిపప్పు

మటన్‌ కీమా బాల్స్‌

కావలసిన పదార్థాలు : మటన్‌ కీమా - 150 గ్రా., ఎండుమిర్చి - 2, పుట్నాలు - 1 టేబుల్‌ స్పూను, జీడిపప్పు - 4, సోంపు - 1 టీ స్పూను, కొబ్బరి తురుము - 2 టేబుల్‌ స్పూన్లు, చిన్న ఉల్లిపాయలు - 6, అల్లం తురుము - 2 టీ స్పూన్లు, వెల్లుల్లి - 6 రెబ్బలు, యాలక్కాయ - 1, దాల్చినచెక్క - అంగుళం ముక్క, లవంగం - 1, కరివేపాకు - 4 రెబ్బలు, గుడ్డు - 1, ఉప్పు - తగినంత, నూనె - వేగించడానికి సరిపడా.
తయారుచేసే విధానం: టీ స్పూను నూనెలో కీమా వేసి నీరు ఆవిరయ్యేవరకు వేగించాలి. కొద్ది నూనెలో యాలక్కాయ, దాల్చినచెక్క, లవంగం, కరివేపాకు, అల్లం తురుము, వెల్లుల్లి, ఉల్లి తరుగు, మిర్చి, జీడిపప్పు, సోంపు, కొబ్బరి తురుము ఒకటి తర్వాత ఒకటి వేగించి పుట్నాల పప్పు చల్లి దించేసి చల్లారనివ్వాలి. ఇవన్నీ మిక్సీలో (నీరు కలపకుండా బరకగా) పొడి చేయాలి. ఇందులోనే కీమా, ఉప్పు, గుడ్డు వేసి అర నిమిషం తిప్పాలి. ఈ ముద్దను గులాబ్‌జామ్‌ సైజులో ఉండలు చేసుకుని నూనెలో దోరగా వేగించాలి (మంట మరీ చిన్నగా, పెద్దగా కాకుండా చూసుకోవాలి). 

Updated Date - 2015-09-01T17:41:45+05:30 IST