పాన్‌ మష్రూమ్స్‌

ABN , First Publish Date - 2015-09-01T20:45:54+05:30 IST

కావలసినవి: బనారస్‌ తమలపాకులు 20, పుట్టగొడుగులు 200 గ్రా., మీడియం సైజు బంగాళదుంపలు 2

పాన్‌ మష్రూమ్స్‌

కావలసినవి: బనారస్‌ తమలపాకులు 20, పుట్టగొడుగులు 200 గ్రా., మీడియం సైజు బంగాళదుంపలు 2, ఉల్లికాడ ముక్కలు 4 టేబుల్‌ స్పూన్లు, వేగించిన జీలకర్ర 100 గ్రా., చీజ్‌ 60 గ్రా., చాట్‌ మసాలా పొడి ఒక టీ స్పూను, శనగపిండి 200 గ్రా., అల్లం-వెల్లుల్లి ముద్ద 2 టేబుల్‌ స్పూన్లు, వాము 4 టీ స్పూన్లు, కారం 8 టీ స్పూన్లు, కుంకుమ పువ్వు చిటికెడు, ఉప్పు, నూనె తగినంత.
ఎలా చేయాలి
తమలపాకుల్ని తడిగుడ్డతో తుడిచి శుభ్రం చేయాలి. తరిగిన పుట్టగొడుగులు, ఉడికించిన బంగాళాదుంపలు, తురిమిన చీజ్‌, ఉల్లికాడ ముక్కలు, జీలకర్ర, కొద్దిగా ఉప్పు, కుంకుమపువ్వులను బాగా కలపాలి. ఒక్కో తమలపాకు మధ్య ఈ మిశ్రమాన్ని కొద్దిగా పెట్టి సిగార్స్‌లా చుట్టాలి. అవి విడిపోకుండా టూత్‌పిక్స్‌ని గుచ్చాలి. తర్వాత శనగపిండిలో అల్లం వెల్లుల్లి ముద్ద, వాము, ఉప్పు, కారం వేసి జారుడుగా ఉండేలా కలపాలి. ఈ పిండిలో తమలపాకు రోల్స్‌ని ముంచి కాగిన నూనెలో వేసి బంగారు రంగు వచ్చేవరకు వేగించాలి. వీటి మీద చాట్‌ మసాలా పొడి చల్లి టొమాటో పచ్చడితో తింటే చాలా బాగుంటాయి.97490527540.్జఞజ

Updated Date - 2015-09-01T20:45:54+05:30 IST