మష్రూమ్‌ కట్లెట్స్‌

ABN , First Publish Date - 2015-09-01T17:46:16+05:30 IST

కావలసిన పదార్థాలు : వెన్న - 2 టేబుల్‌ స్పూన్లు, ఉల్లిపాయలు - 2 (పెద్దవి), బాదం పేస్టు

మష్రూమ్‌ కట్లెట్స్‌

కావలసిన పదార్థాలు : వెన్న - 2 టేబుల్‌ స్పూన్లు, ఉల్లిపాయలు - 2 (పెద్దవి), బాదం పేస్టు - 2 టేబుల్‌ స్పూన్లు, గరం మసాలా - అర టీ స్పూను, టమోటో గుజ్జు - 1 టేబుల్‌ స్పూను, బటన్‌ మష్రూమ్స్‌ (నలుపలకలుగా తరగాలి) - 50 గ్రా., తాజా మొక్కజొన్న గింజలు - 50 గ్రా., బంగాళదుంపలు - 50 గ్రా., బ్రెడ్‌ పొడి - 150 గ్రా., ఉప్పు - రుచికి తగినంత, కార్న్‌ఫ్లోర్‌ - 50 గ్రా., నీరు - 100 గ్రా., మైదా - 2 టేబుల్‌ స్పూన్లు, నూనె - వేగించడానికి సరిపడా.
తయారుచేసే విధానం : కడాయిలో రెండు టేబుల్‌ స్పూన్లు నూనె వేసి ఉల్లిపాయల్ని దోరగా వేగించుకోవాలి. తర్వాత వెన్న, బాదం పేస్టు, గరంమసాలా, టమాటో గుజ్జు, మష్రూమ్స్‌, మొక్కజొన్న గింజలు, ఉడికించి మెదిపిన బంగాళదుంప, ఉప్పువేసి 2 నిమిషాల పాటు వేగించి దించేసి చల్లారనివ్వాలి. తర్వాత 50 గ్రా. బ్రెడ్‌ పొడిని కలిపి మీకు కావలసిన ఆకారంలో కట్లెట్స్‌లా తయారుచేసి పెట్టుకోవాలి. ఒక పాత్రలోకి కార్న్‌ఫ్లోర్‌, మైదా, సరిపడా ఉప్పు వేసి నీటితో జారుగా కలుపుకోవాలి. కట్లెట్లను ఈ జారులో ముంచి మిగిలిన బ్రెడ్‌ పొడిలో పొర్లించి నూనెలో వేగించుకోవాలి. వీటిని పుదీనా చట్నీతో లేక టమోటా సాస్‌తో తింటే చాలా రుచిగా ఉంటాయి.

Updated Date - 2015-09-01T17:46:16+05:30 IST