కొత్తిమీర పచ్చడి

ABN , First Publish Date - 2015-09-01T22:46:05+05:30 IST

కావలసిన పదార్థాలు: కొత్తిమీర - 2 కప్పులు, వెల్లుల్లి రేకలు - 4, పండు మిర్చి - 2, పచ్చిమిర్చి - 3

కొత్తిమీర పచ్చడి

కావలసిన పదార్థాలు: కొత్తిమీర - 2 కప్పులు, వెల్లుల్లి రేకలు - 4, పండు మిర్చి - 2, పచ్చిమిర్చి - 3, చింతపండు - 4 రెబ్బలు, నువ్వులు - 1 టేబుల్‌ స్పూను, ఎండుకొబ్బరి తురుము - అర కప్పు, ఉప్పు - రుచికి తగినంత, నూనె - 1టీ స్పూను.
తయారుచేసే విధానం: నువ్వులు, ఎండుకొబ్బరి దోరగా వేగించి పక్కనుంచుకోవాలి. కడాయిలో నూనె వేసి పచ్చిమిర్చి, పండుమిర్చి ముక్కలు, కొత్తిమీర, చింతపండు మగ్గనివ్వాలి. తర్వాత వేగించిన నువ్వులు, ఎండు కొబ్బరితో పాటు మెత్తబడ్డ కొత్తిమీర మిశ్రమాన్ని చేర్చి నూరుకోవాలి. వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని తింటే కమ్మగా ఉండే పచ్చడిది.

Updated Date - 2015-09-01T22:46:05+05:30 IST