Abn logo

చికెన్‌ గారెలు

కావలసిన పదార్థాలు: బోన్‌లెస్‌ చికెన్‌ - పావు కిలో, శనగపప్పు - 2 కప్పులు, గరం మాసాలా - 2 టీస్పూన్లు, కారం - 1 టీస్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ - చిన్న ముద్ద, పచ్చిమిరిపకాయలు - 4, ఉల్లిపాయలు - 2, పసుపు - చిటికెడు, కొత్తిమీర కట్ట - 1, నూనె, ఉప్పు - తగినంత.
తయారీ విధానం: గిన్నెలో శనగపప్పు వేసి నీళ్లలో నానబెట్టుకోవాలి. చికెన్‌ ముక్కలు శుభ్రంగా కడిగి కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్‌, పసుపు, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడికించుకోవాలి. నానబెట్టిన శనగపప్పును మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బుకున్న ఈ శనగపప్పు ముద్దకు ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉడికించిన చికెన్‌, మసాలా, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. కడాయిలో నూనె వేడిచేసి కొద్దిగా చికెన్‌ ముద్దను అరచేతిలో తీసుకుని మధ్యలో రంధ్రం చేసి నూనెలో వేయించాలి. అంతే వేడి వేడి చికెన్‌ గారెలు రెడీ.92ల్‌ోగి6

సామాజిక సేవలో పోలీసులుపలుచోట్ల కరోనా నిర్దారణ క్యాంపులుసౌదీ నుంచి కూచన్‌పెల్లికి చేరుకున్న మృతదేహంవిద్యుదాఘాతంతో హార్వెస్టర్‌ ఆపరేటర్‌ మృతినీటితొట్టిలో పడి బాలుడు మృతిరైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలిపొదుపు సంఘాలకు ప్రోత్సాహమేదీ ?బడికి డుమ్మా..!పట్టుదలతో లక్ష్యాన్ని సాధించాలి: కలెక్టర్‌రైతు వేదిక నిర్మాణంపై కేటీఆర్‌కు ట్వీట్‌
Advertisement
Advertisement