క్యాబేజీ కూటు

ABN , First Publish Date - 2015-10-02T15:10:25+05:30 IST

కావలసిన పదార్థాలు: క్యాబేజీ తురుము: అరకప్పు, పచ్చిశనగపప్పు: ముప్పావు కప్పు, పెసరపప్పు:

క్యాబేజీ కూటు

కావలసిన పదార్థాలు: క్యాబేజీ తురుము: అరకప్పు, పచ్చిశనగపప్పు: ముప్పావు కప్పు, పెసరపప్పు: పావు కప్పు, పసుపు: చిటికెడు, ఉప్పు: రుచికి సరిపడ, కొత్తిమీర: కొద్దిగా, ఆవాలు: టేబుల్‌ స్పూను, జీలకర్ర: టేబుల్‌ స్పూను, మినపప్పు: కొద్దిగా, ఎండు మిరపకాయలు: మూడు లేక నాలుగు, ఇంగువ: చిటికెడు, నూనె: సరిపడ, కొబ్బరి తురుము: మూడు లేక నాలుగు స్పూన్లు, పచ్చిమిరపకాయలు: మూడు లేక నాలుగు
తయారీ విధానం: ముందుగా కొబ్బరితురుము, పచ్చిమిరపకాయలు, జీలకర్ర కలిపి ముద్దగా చేసుకోవాలి. పచ్చిశనగపప్పు, పెసరపప్పు, క్యాబేజీ తురుము, పసుపు వేసి కుక్కర్‌లో ఒకటి రెండు విజిల్స్‌ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మందపాటి గిన్నె లేదా బాండీ తీసుకొని దానిలో తగినంత నూనె వేసి కాగిన తరువాత ఎండు మిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసి కొద్దిసేపు వేయించాలి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న క్యాబేజీని జతచేసి ఉప్పు వేసుకోవాలి. కొద్దిసేపు ఉడికిన తరువాత కొబ్బరి ముద్దను జత చేసి మరికొద్దిసేపు ఉడికించి దింపే ముందు కొత్తిమీర చల్లుకోవాలి.

Updated Date - 2015-10-02T15:10:25+05:30 IST